తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ ఇంకా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''వారసుడు''.తమిళ్ లో 'వారిసు' అనే పేరుతో వస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే 'వారసుడు' సినిమా నుంచి వచ్చిన విజయ్ మూడు లుక్స్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న విజయ్ ఈసారి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడని లుక్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్ ని తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు.'వారసుడు' నుంచి విజయ్ సరికొత్త స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పోస్టర్స్ చూసిన నెటిజన్లు 'మహర్షి' సినిమాతో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు.


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ సినిమా మహర్షి. ఇందులో మహేష్ స్టూడెంట్ ఇంకా ఓ కంపెనీ సీఈఓగా లుక్స్ పరంగా వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.సేమ్ వారసుడు సినిమాలో కూడా విజయ్ సూటూ బూటూ వేసి బిజినెస్ మ్యాన్ గా ఉబర్ కూల్ లుక్ లో కనిపించాడు. అయితే ఈ స్టిల్స్ చూస్తుంటే 'మహర్షి' లో మన సూపర్ స్టార్ మహేశ్ గుర్తుకు రాకమానదు. కాస్ట్యూమ్స్, చేతిలో టీ గ్లాస్ తో సహా ప్రతీ అంశం ఆ సినిమాతో కంపేర్ చేసేలా ఉంది. జయసుధ, విజయ్ కలిసి ఉన్న స్టైల్ కూడా మహర్షిలో మహేష్, జయసుధ ఉన్న ఫ్రేమ్ ని గుర్తు చేస్తోంది. కొంపతీసి ఇది వారసుడు మహర్షికి రీమేక్ సినిమానా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే విజయ్ కాపీ రాయుడు ఎప్పుడు తెలుగు మూవీస్ స్టోరీలు, పాటలు తెలుగు హీరోలను కాపీ కొడుతూ ఉంటాడు అని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: