స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తెలియనివారంటూ ఎవ్వరు ఉండరు. అమ్మ, అత్త పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. ఎమోషనల్ సన్నివేశాల్లో అలరించే ప్రగతి కామెడీ అలవోకగా  బాగా పండించగలరు.

ఎఫ్ 2 మూవీలో ప్రగతి కామెడీ టైమింగ్ ఎవరూ మర్చిపోరు. సిల్వర్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గా కనిపించే ప్రగతి వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులు ఉన్నాయి అంటా మరి. ఆమె భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. ఏళ్లుగా ఇద్దరు పిల్లల బాధ్యత విజయంతంగా నెరవేరుస్తున్నారు. ఇక పెళ్లి తన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయంగా ప్రగతి తాజా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించార

హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్న సమయంలో కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేక సినిమాలు వదిలేశారు. రైన్ సాంగ్ లో ట్రాన్సపరెంట్ డ్రెస్ ధరించాల్సి ఉండగా అది ఇష్టం లేక ప్రగతి చేయనని చెప్పేశారట. పెళ్లి చేసుకోవడం జీవితంలో తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా ప్రగతి అభివర్ణించారు. ప్రగతి మాట్లాడుతూ… సంసారం జీవితంలో చాలా ఎక్కువ కాంప్రమైజ్ అయ్యాను. ఒక దశకు వచ్చాక తట్టుకోలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాను.

భర్తతో విడాకుల అనంతరం ఇద్దరు పిల్లలతో బయటికి వచ్చేశాను. ఉన్న నగలు అమ్మి సింగిల్ బెడ్ రూమ్ ఇంటికి షిఫ్ట్ అయ్యాను. చేతిలో  అప్పుడు డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియని సమయంలో ఒక నిర్మాత ఫోన్ చేసి సీరియల్ ఆఫర్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన రూ. 10 వేల చెక్ చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది. ఎంత సంపాదించినా ఆ చెక్ నాకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది. ఇప్పుడు నా పిల్లల వయసు అబ్బాయికి 20 అమ్మాయికి 14. మా ముగ్గురిదే ప్రపంచం. ఎలాంటి నిర్ణయం అయినా ముగ్గురం కలిసే తీసుకుంటాము. నన్ను అర్థం చేసుకునే పిల్లలు పుట్టడం నా అదృష్టం అంటూ ప్రగతి అన్నారు

లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు బాగా ఎదురయ్యాయి. షూటింగ్స్ లేకపోవడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఆ సమయంలో నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, ప్రగతి చెప్పుకొచ్చారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. ఆ కారణంగానే లేడీ బాస్ ఫీలింగ్ కలిగిందని ప్రగతి వెల్లడించారు. ఒంగోలుకు చెందిన ప్రగతి 1994లో ఒక తమిళ చిత్రంతో హీరోయిన్ అయ్యారు. వరుసగా 7 చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. మహేష్ బాబీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్  కూడా స్టార్ట్ చేశారు ఈ నటి.

మరింత సమాచారం తెలుసుకోండి: