కన్నడ హీరోయిన్ రష్మిక తెలుగు ప్రేక్షకులకు, తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటిస్తోంది రష్మిక. ప్రస్తుతం హీరో విజయ్ దళపతి తో వారసుడు అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుంచి తమిళ సినిమాలు చూసేదట. అందుచేతనే తనకు దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమని ఎప్పుడు చెబుతూ ఉండేది. ఇప్పుడు అలాంటి అభిమాన హీరోతోనే నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంబరపడిపోతోంది ఈ ముద్దుగుమ్మ.
అందుకే ఈ సినిమా ముహూర్తం పెట్టిననాటి నుంచి ఈ సినిమా షూటింగ్లో ప్రతిరోజు ప్రతి మూమెంట్ ను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటోంది రష్మిక. అంతేకాకుండా ఈ షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు విజయ్ తో సెల్ఫీ దిగినటువంటి ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి అలాంటి సెల్ఫీతోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. వారసుడు సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఈ సెల్ఫీ విజయ్ తో పాటు హీరోయిన్ ఖుష్బూ కూడా ఉన్నది.


మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న వారసుడు చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు చిత్ర బృందం. ప్రస్తుతం రష్మిక పుష్ప -2 సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. ఒక బాలీవుడ్ లో గుడ్ బై సినిమా ఇటీవల కాలంలో విడుదల కాగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దాంతో రష్మిక నటించిన తదుపరి చిత్రం మిషన్ మజ్ను మీదే ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమాతో సక్సెస్ అవుతుందేమో చూడాలి.


Rashmika, Vijay

మరింత సమాచారం తెలుసుకోండి: