ప్రతి సంవత్సరం సంక్రాంతికి టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ ఉండటం సర్వ సాధారణమైన విషయం. అయితే ఎప్పుడు లేని విధంగా ఇంకా సంక్రాంతి రాకుండానే ఈసారి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ‘మినీ సంక్రాంతి వార్’ జరగబోతూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ ఈసారి ఒకటి కాదు ఏకంగా 5 సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీ పడుతూ ఉండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.


‘కార్తికేయ 2’ సూపర్ సక్సస్ తరువాత నిఖిల్ నటించిన ‘18 పేజెస్’ డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. విజయ్ సేతుపతి నటించిన ‘మెర్రి క్రిస్మస్’ కూడ అదేరోజున విడుదల కాబోతోంది. అదేరోజున సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీని కూడ విడుదల చేయడానికి గుణశేఖర్ ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆరోజున విడుదల చేయడానికి రవితేజా తన లేటెస్ట్ మూవీని డేట్ లాక్ చేసుకున్నాడు.


కుదిరితే అదే డేట్ కు నందిని రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ మూవీని విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే డిసెంబర్ 16న హాలీవుడ్ భారీ గ్రాఫిక్ మూవీ ‘అవతార్ 2’ విడుదల కాబోతోంది. అత్యంత భారీ అంచనాలు ఉన్న ఈమూవీ క్రిస్మస్ సీజన్ లో ప్రపంచవ్యాప్తంగా కలక్షన్స్ సునామీని సృష్టించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.


దీనితో ‘అవతార్ 2’ మ్యానియా ముందు ఇన్ని సినిమాలు ఎక్కడ తట్టుకుంటాయి అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే ‘అవతార్’ మ్యానియాను లెక్క చేయకుండా ఇన్ని మీడియం రేంజ్ సినిమాలు విడుదల అవుతూ ఉండటంతో ఇది మరో మినీ సంక్రాంతి రేస్ గా మారిందని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే సాధారణంగా క్రిస్మస్ సీజన్ లో విడుదలైన సినిమాలకు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఆసినిమాలు సంక్రాంతి సీజన్ వరకు ధియేటర్లలో కొనసాగడం చాల కష్టం. సినిమాలు హిట్ అయినప్పటికీ సంక్రాంతి సినిమాల కోసం క్రిస్మస్ సీజన్ సినిమాలను కలక్షన్స్ ఉండగానే తీసేసిన సినిమాలు గతంలో ఎన్నో ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: