టాలీవుడ్ లో హీరో నితిన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. రెండు దశాబ్దాల కాలం నుంచి కెరియర్ లో ఎన్నో హిట్ ఫ్లాప్ లను అందుకుంటు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కథ ల ఎంపిక విషయంలో పలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి విజయాలను అందుకున్నారు. కానీ ఈ క్రమంలోనే తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్న నేపథ్యంలో వరుస ప్లాపులు ఎదురవుతూనే ఉన్నాయి. నితిన్ హీరోగా ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాని తన హోమ్ బ్యానర్ లోనే నితిన్ తండ్రి నిర్మించారు.


ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని చూసింది. ఓపెనింగ్ పరంగా కలెక్షన్లు బాగానే వచ్చిన ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఓటీటి లో ఈ సినిమా మంచి ఆదరణ పొందుతుందని నితిన్ అభిమానులు భావించారు. అయితే ఈ సినిమా విడుదలై మూడు నెలలు కావస్తున్న ఇంతవరకు డిజిటల్ వేదికగా ఈ సినిమా ప్రసారం కాలేదు. అయితే ఇందుకు కారణం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకోవడమే అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలకు ముందు నిర్మాతలు అనుకున్న దరికి రిజల్ట్ చూశాక ఓటిటి సంస్థ ఆఫర్ చేసిన రేట్ కి చాలా వ్యత్యాసం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులు ద్వారా వీలైనంతవరకు నష్టాలు భర్తీ చేసుకోవాలనే చిత్ర మేకర్స్ భావించగా ఇప్పుడు ఆ రేటుకు కూడా గిట్టుబాటు కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కాలంలో ఎన్నో బడా సినిమాలు బ్లాక్ బాస్టర్ చిత్రాలు నెల తిరగకుండానే ఓటీడీలో స్ట్రిమింగ్ అవుతూ వచ్చాయి. ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్, స్వాతిముత్యం తదితర చిత్రాలు కూడా ఓటీటి లో విడుదలయ్యాయి. కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలు అందుకున్న నితిన్ ఇప్పుడు కథల ఎంపిక విషయంలో పొరపాటు చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: