తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు వరుసగా క్షణం , గూడాచారి , ఎవరు , మేజర్ మూవీ లతో వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటు ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అడవి శేషు ఈ సంవత్సరం మేజర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు "హిట్ ది సెకండ్ కేస్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో అడవి శేషు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ చాలా అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ టీజర్ పై తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి కార్తీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.  

కార్తీ సోషల్ మీడియా వేదికగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ గురించి స్పందిస్తూ ... హిట్ 2 టీజర్ చాలా బాగుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. అలాగే అడవి శేషు కు గుడ్ లక్ అని సోషల్ మీడియా వేదికగా కార్తీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కార్తీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: