అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రిష ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన త్రిష ఈ మధ్యకాలంలో మాత్రం ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడం లేదు. త్రిష ప్రస్తుతం ఎక్కువగా తమిళ మూవీ లలో నటిస్తూ వస్తుంది. తమిళ్ లో కూడా త్రిష ఈ మధ్య కాలంలో కమర్షియల్ మూవీ లలో నటించడం కంటే కూడా ,  తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా త్రిష "పోన్నియన్ సెల్వన్" అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించగా ,  చియాన్ విక్రమ్ ,  కార్తీ , జయం రవి ,  ఐశ్వర్యా రాయ్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ ,  తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లోని త్రిష పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా పోన్నియన్ సెల్వన్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న త్రిష తాజాగా గాయపడింది. విదేశాల్లో పర్యటిస్తున్న త్రిష జారీ పడడంతో కాలికి ప్యాక్చర్ అయినట్లు సమాచారం. ఈ మేరకు కాలికి గాయం కావడంతో కట్టు కట్టిన ఫోటోను త్రిష తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే వెకేషన్ ట్రిప్ ను క్యాన్సిల్ చేసినట్లుగా అందులో త్రిష పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: