బాహుబలి
సినిమా తర్వాత ఒకటి రెండు లేడి ఓరియంటెడ్ సినిమాలలో నటించిన
హీరోయిన్ అనుష్క ఆ తర్వాత సినిమాలలో నటించడం మానేసింది అన్న వార్తలను ఎక్కువగా వినిపించారు. కానీ తాజాగా ఆమె నటించబోయే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.
నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ
హీరోయిన్ గా నటించబోతుంది అన్న వార్తలు చాలా రోజులుగా వినిపించాయి. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ
సినిమా ఉందో లేదో అని అందరూ అనుకున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన పోస్టును చిత్ర బృందం విడుదల చేసింది. దీనిని బట్టి ఆమె ఈ
సినిమా లో నటించడం ఖాయం అనేది తెలుస్తుంది. త్వరలోనే
నవీన్ పోలిశెట్టి లుక్కును కూడా ఈ
సినిమా నుంచి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. జాతి రత్నాలు
సినిమా హిట్ కావడం తో ఈ
హీరో వరుస
సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ
హీరో ఇంతటి పెద్ద
హీరోయిన్ తో
సినిమా చేయడం నిజంగా మంచి విశేషం అని చెప్పాలి.
త్వరలోనే ఈ
సినిమా యొక్క ప్రకటన కూడా ఇవ్వబోతున్నారు. ఎంతో వెరైటీగా ఈ
సినిమా ఉండబోతుంది అని అంటున్నారు. వయసైపోయినా
పెళ్లి కాని యువత పాత్రలో
అనుష్క నటించిన పోతుంది అని చెబుతున్నారు. ఒక
యువ కుర్రాడు ఈమెను చూసి ప్రేమించి ఆమెను ఏ విధంగా
పెళ్లి చేసుకున్నాడు అనే కథాంశం తోనే ఈ చిత్రం ఉండబోతుందట. ఈ లుక్ లో ఆమె కిచెన్ లో డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఉందీ లుక్. ఈ స్పెషల్
పోస్టర్ లో అనుష్కకు బర్త్ డే విశెస్ తెలిపారు. ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ
మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవరిస్తున్నారు.వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.