దర్శకుడు హను రాఘవపూడి ‘సీతారామం’ మూవీ విడుదల అయ్యేంతవరకు మీడియం రేంజ్ హీరోల దర్శకుడు టాప్ హీరోలు అతడి గురించి పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే ‘సీతారామం’ విడుదల తరువాత అతడి ఇమేజ్ గ్రాఫ్ పూర్తిగా మారిపోవడంతో టాప్ హీరోలు కూడ అతడితో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరుస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.


అయితే ఇప్పుడు నాని శర్వానంద్ లు కూడ హను రాఘవపూడి వైపు చూస్తూ ఉండటంతో అతడితో సినిమాలు చేయాలి అని ఆశ పడుతున్న హీరోల సంఖ్య బాగా పెరిగింది. వాస్తవానికి హను నానితో ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాధ’ గతంలో చేసాడు. ఆతరువాత హను మరొక సినిమాను నాని తో చేయాలని ప్రయత్నించినప్పటికీ అప్పట్లో నాని హను తో సినిమా చేయాలని పెద్దగా ఆశక్తి కనపరచలేదు అని అంటారు.


అదేవిధంగా హను శర్వానంద్ తో ‘పడిపడి లేచె మనసు’ మూవీ తీసాడు. ఆమూవీ ఫ్లాప్ గా మారిన తరువాత శర్వానంద్ హను వైపు చూడలేదు అని అంటారు. అయితే ‘సీతారామం’ సూపర్ సక్సస్ అయిన తరువాత నాని అదేవిధంగా శర్వానంద్ హను రాఘవ పూడితో సినిమా చేయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపినట్లు టాక్. అయితే హను రాఘవ పూడి ఆలోచన మాత్రం ఈసారి మీడియం రేంజ్ హీరోల పై కాకుండా టాప్ యంగ్ హీరోల వైపు మళ్ళినట్లు తెలుస్తోంది.



ఈ ప్రయత్నంలో భాగంగా హను రాఘవపూడి ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం అతడికి ఒక వెరైటీ లవ్ స్టోరీ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లవ్ స్టోరీ లైన్ విన్న తరువాత జూనియర్ కు ఆకథ నచ్చి హను ని ఆ స్టోరీని స్క్రిప్ట్ గా మార్చమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జూనియర్ కొరటాల ఆతరువాత ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఇన్ని సినిమాల మధ్య హను రాఘవపూడి ఎక్కడ ఎడ్జెస్ట్ అవుతాడు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..




మరింత సమాచారం తెలుసుకోండి: