జాతి రత్నాలు వంటి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడంతో అందం, అభినయంతో కామెడీ టైమింగ్తో పరీక్షలను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించింది. ఇక జాతి రత్నాలు చిత్రం తర్వాత అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది. ఇక అటు తర్వాత బంగార్రాజు చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్లో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక తాజాగా హీరోయిన్గా నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకోవాలని ఫారియా అబ్దుల్లా ఎంతగా ఆశపడింది.. పైగా ఈ సినిమా నుంచి విజయం వస్తే తనకు మరిన్ని ఆఫర్లు వస్తాయని అనుకున్న.. ఆమె ఆశించిన ఫలితం దక్కలేదని తెలుస్తోంది. ఇక తన తదుపరిచిత్రం ఏంటి అన్న విషయం ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం తెలుగులో ఫారియా అబ్దుల్లా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చేస్తున్నట్లు కనిపించలేదు. కేవలం రావణాసుర చిత్రంలో రవితేజ హీరోగా చేస్తున్న చిత్రంలో మాత్రమే నటిస్తోంది. ఇందులో ఇతర హీరోయిన్లు కూడా నటిస్తూ ఉన్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఫారియా అబ్దుల్లా హోప్స్ అన్ని కూడా ఈ చిత్రం మీద పెట్టుకున్నట్లు సమాచారం ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ లో ఏదైనా తేడా వస్తే ఇక ఈమె కెరియర్ కూడా డేంజర్ లో పడడం ఖాయమని సినీ ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: