సినీ డబ్స్ యాప్‌ను ఎలా వాడాలంటే..
* గూగుల్ ప్లే స్టోర్/ యాప్ స్టోర్ నుండి 'సినీడబ్స్' యాప్‌ను డౌన్లోడ్ చేయాలి.
* మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరు, ఫేస్బుక్ ద్వారా యాప్‌లో లాగిన్ అవ్వాలి.
* ఆ తర్వాత యాప్‌కు లొకేషన్, మైక్రోఫోన్, ఫోన్ పర్మిషన్ లాంటివి చెయ్యాలి.
* లిస్ట్‌లో మీరు చూడాలనుకుంటున్న సినిమా టైటిల్ క్లిక్ చేసి ఆ వాయిస్ ఫైల్ని డౌన్లోడ్ చెయ్యాలి.
* థియేటర్‌కు వెళ్లాక యాప్‌లో ఆ సినిమా ట్రాక్‌ను ప్లే చెయ్యాలి.
* అప్పుడు మీ మొబైల్లో మైక్రోఫోన్ ద్వారా సినిమా స్టార్ట్ అయ్యింది లేనిదీ యాప్ చూస్తుంది.
* తెర మీద సినిమా మొదలవ్వగానే మొబైల్లో ట్రాక్ ప్లే అవ్వడం ప్రారంభమవుతుందన్నమాట.
* అందుకు తగ్గట్టుగా వీడియో, ఆడియో సింక్ అయ్యేలా యాప్ చూసుకుంటుంది.
*ఇక 'యశోద' సినిమా విషయానికొస్తే.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఆడియో ట్రాక్స్ అందుబాటులో ఉన్నాయి.
* అయితే రీసెంట్ విడుదలైన 'గాడ్ ఫాదర్', 'కార్తికేయ 2', 'సీతారామం', 'విక్రాంత్ రోణ', 'రాకెట్రీ' తదితర సినిమాలున్నాయి..!!