ఇటీవల సినీ ప్రపంచంలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా నటి నటులు దర్శక నిర్మాతలు తదితరులు కూడా వరుసగా కన్నుమస్తూ ఉన్నారు. రెండు నెలల క్రితం కృష్ణంరాజు కన్నుమూయడం జరిగింది. ఆ జ్ఞాపకాలు మరువకముందే రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో మరణించారు. ఈ వార్తలు మరవకముందే తాజగా సీనియర్ నటిమని కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఎవరా నటి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


గత కొంతకాలంగా పంజాబీ ఇండస్ట్రీలో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ఇటీవలే ప్రముఖ దర్శకుడు నటుడు గురిందర్ డింపి కన్నుమూశారు. తాజాగా స్టార్ హీరోయిన్ దల్జిత్ కౌర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈమె వయసు 69 సంవత్సరాలు. బాలీవుడ్లో 10కి పైగా సినిమాలలో నటించిన ఇమే పంజాబ్లో 70 సినిమాలలో నటించింది.నటి దల్జిత్ కౌర్ ఢిల్లీకి చెందిన శ్రీరామ్ మహిళా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. సినిమాలపై ఎక్కువ ఇష్టం ఉండడంతో పూణే ఫిలింలో అందుకోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈమె మొదటి చిత్రం దాజ్ 1976 లో విడుదల అయ్యింది. ఇక తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఈమె భర్త హర్మిందర్ సింగ్ డియోల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది 2001లో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినప్పటికీ ఈమె ఆరోగ్యం అంతగా సహకరించలేదని వార్తలు వినిపిస్తున్నాయి మళ్లీ సినిమాలకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దల్జిత్ కౌర్ మృతి చెందడం జరిగింది. ఈమె మృతి పైన పలువురి సినీ ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు. దీంతో ఈమె అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: