వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. అవే బాలకృష్ణ. నటించిన వీర సింహా రెడ్డి మరియు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.  ఇప్పటిదాకా చాలాసార్లు వీరిద్దరి మధ్య భారీ స్థాయిలో పోటీ జరగగా ఒకరిపై ఒకరు చాలాసార్లు పై చేయి సాధించారు. అయితే ఇప్పుడు ఈ పోటీ మరింత రసవత్తరంగా జరుగుతుంది అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఒకే జోనర్ లో సినిమాలను చేస్తున్నారు. అంతేకాదు మాస్ సినిమాలు గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమాల ద్వారా వారు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి. ఇద్దరికీ కూడా ప్రేక్షకులలో ఎంతగా అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న వీరు ఇప్పటికీ ఐదు పదుల వయసు వచ్చిన కూడా అదే విధంగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అయితే ఈ సినిమాలకు థియేటర్లో పంపిణీ విషయం లో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. చాలా సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏ సినిమా కు ఎన్ని థియేటర్లు ఇస్తారో అన్న అనుమానాలు లేకపోలేవు. అలాంటి ఇప్పుడు ఈ అయోమయం ఇద్దరి హీరోల అభిమానులలో నెలకొంది అని చెప్పవచ్చు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి చిత్రం ఓకే భాషలో విడుదల కాబోతూ ఉండగా బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రెండు భాషల్లో విడుదల అవుతుంది. ఇక కొసమెరుపు ఏంటంటే.. ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు తమన్ మరియు దేవిశ్రీ ప్రసాద్ లు కూడా పోటీ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: