మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. 1 నేనొక్కడినే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకోక పోయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన కృతి సనన్ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో హీరోయిన్ గా నటించి , అలాగే ఎన్నో విజయాలను హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. తాజాగా కృతి సనన్ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఆది పురుష్ అనే మూవీ లో  హీరోయిన్ గా నటించింది.

మూవీ ని మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందింది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే కృతి సనన్  తాజాగా బేడియా అనే హిందీ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని తెలుగు లో తోడేలు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా కృతి సనన్ తెలుగు సినిమాలలో తనకు ఏ సినిమాలు అంటే బాగా ఇష్టమో చెప్పుకొచ్చింది. కృతి సనన్ తాజాగా పుష్ప మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు తనకు చాలా నచ్చాయని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: