జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు ను తెచ్చుకొని ఆ తర్వాత ఎన్నో కామెడీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని ప్రస్తుతం టీవీ షో లో పాల్గొంటూనే సినిమాల్లో నటిస్తున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే సుడిగాలి సుదీర్ ఈ మధ్య కాలంలో టీవీ షో ల కంటే కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే సాప్ట్ వేర్ సుధీర్ అనే మూవీ లో సుధీర్ హీరో గా నటించాడు.

మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. తాజాగా సుధీర్ గాలోడు అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందింది. ఈ మూవీ కి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , గెహ్న సీప్పి ఈ మూవీ లో సుధీర్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ 2 రోజుల్లో గాలోడు మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.
నైజాం : 85 లక్షలు .
సీడెడ్ :  34 లక్షలు .
ఆంధ్ర :  1.16 కోట్లు .
రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలోడు మూవీ 1.20 కోట్ల షేర్ , 2.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గాలోడు1.22 కోట్ల షేర్ , 2.42 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: