తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ కావాలి మూవీ తో హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన ఆది సాయికుమార్ మొదటి మూవీ తోని మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో మూవీ లలో హీరో గా నటించిన ఆది సాయికుమార్ కు ఇప్పటి వరకు సరైన విజయం లవ్లీ మూవీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర లభించలేదు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం కూడా ఆది సాయికుమార్ అనేక మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. కాకపోతే ఏ మూవీ కూడా ఈ హీరో కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆది సాయికుమార్ "టాప్ గేర్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. 

టాప్ గేర్ మూవీ ని డిసెంబర్ 30 తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను ప్రకటించింది. టాప్ గేర్ మూవీ నుండి "వెన్నెల వెన్నెల" అనే సాంగ్ ను నవంబర్ 25 వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. మరి ఈ మూవీ తో ఆయన ఆది సాయికుమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటాడో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: