బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ ధావన్ ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో హీరో గా నటించి హిందీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే హిందీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్న ఈ హీరో తాజాగా బేడియా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ ని హిందీ తో పాటు తెలుగు  తమిళ భాషల్లో కూడా నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని తోడేలు అనే పేరుతో విడుదల చేయనున్నారు. అమర్ కౌశిక్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈ మూవీ లో వరుణ్ ధావన్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. జియో స్టూడియోస్  సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ ఈ మూవీ ని నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడం తో , ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా తోడేలు మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

సెన్సార్ బోర్డు నుండి తోడేలు మూవీకి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 36 నిమిషాల నిడివితో  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 2 D మరియు 3 D వర్షన్ లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తోడేలు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: