తమిళ్ లో ఇటీవల ఒక చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించి కోలీవుడ్ మరియు టాలీవుడ్ వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇప్పట్లో పెద్ద తారాగణంతో , మంచి బడ్జెట్ తో అన్ని హంగులతో అద్భుతంగా తెరకెక్కించిన సినిమాలకే గ్యారంటీ లేదు. అలాంటిది హీరో, డైరెక్టర్ మరియు రైటర్ అన్నీ తానై మనసు పెట్టి తీసిన సినిమా "లవ్ టుడే"..... అన్ని వర్గాల వారికి నచ్చింది. ఇది గమనించిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వెంటనే ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడానికి పూనుకున్నాడు. అలా ఈ సినిమా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చాలా మంది ఈ సినిమా గురించి తక్కువగా అంచనా వేసుంటారు. అసలు ఎందుకు ఈ సినిమాను చూడాలి అనుకునే వారికి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

ఈ సినిమాకు కర్త, కర్మ మరియు క్రియ అన్నీ హీరో ప్రదీప్ రంగనాథన్... ఒక సాధారణ యువకుడిగా కనిపిస్తూ అందరినీ షాక్ కు గురిచేసి ఉండొచ్చు. కానీ సినిమాలో ఇతని నటనకు, డైరెక్షన్ కు మరియు డైలాగ్స్ కు మంత్రముగ్ధులు అవ్వడం ఖాయం. ఒక చిన్న కాన్సెప్ట్ ను రెండున్నర గంటల సినిమాగా తీయడం అంటే పెద్ద సాహసమే. ముఖ్యంగా ట్రైలర్ ద్వారా కథ ఏమిటి అన్నది అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ప్రదీప్ రంగనాధన్ ప్రతి సీన్ ను చాలా సిన్సియారిటీతో తెరకెక్కించి ప్రేక్షకులు ఎక్కడా నిరాశపడకుండా జాగ్రత్త తీసుకున్నాడు.

చిన్న పాయింట్ ... " ఇద్దరు లవర్స్ ఒక్క రోజు ఒకరి ఫోన్ మరొకరు తీసుకుని గడపడం". వినడానికి చాలా తమాషాగా ఉన్నా అందులో ఎంత వినోదాన్ని చూపించాడంటే రెండు గంటల పాటు సీట్ లో నవ్వుతూనే ఉంటామంటే నమ్మండి. ఇక చివరి అర్ద గంటలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్ ను ఇస్తుంది. ఇందులో అయిదు పాత్రలు మాత్రమే మన కళ్ళ ముందు మెదులుతుంటాయి... హీరో ప్రదీప్, హీరోయిన్ ఇవానా, హీరోయిన్ తండ్రి సత్యరాజ్, రాధికా మరియు యోగిబాబు లు. వీరు తమ పాత్రలకు 100 శాతం న్యాయం చేయడం మూలంగానే సినిమా ఎక్కడా మైనస్ లు లేకుండా అందరినీ అలరించేలా ఉంది. ఈ మధ్య మీరు చూసిన చాలా సినిమాల కంటే భిన్నంగా ఉంది. ఈ వారం చివర మీరు మీ ఫ్యామిలీతో వెళ్లి ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది.  

మరింత సమాచారం తెలుసుకోండి: