సాధారణంగా ఒక భాషలో మంచి విజయం సాధించిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేయడం ఎప్పటినుంచో జరుగుతుంది.ఇక  టాలీవుడ్ లో రీమేక్ సినిమాల హడావిడి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది.అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలు రీమేక్ సినిమాలపై ఎక్కువగా మోజు పడుతున్నారు.ఇక  అలా ఇటీవల వచ్చిన `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్`, `గాడ్ ఫాదర్` చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.కాగా ఇప్పుడు చిరు, పవన్ ల రూట్ లోనే టాలీవుడ్ కింగ్, అక్కనేని మన్మధుడు నాగార్జున కూడా వెళ్లాలని డిసైడ్ అయ్యారట. 

అయితే ఈయన సోలోగా హిట్ అందుకుని చాలా కాలమైంది. ఇకపోతే 2016లో విడుదలైన `సోగ్గాడే చిన్నినాయనా` తర్వాత నాగార్జున ఖాతాలో హిట్ పడలేదు. అయితే ఈ ఏడాది ఆరంభంలో నాగార్జున నుంచి `బంగార్రాజు` చిత్రం వచ్చింది. కానీ ఇందులో నాగార్జున కంటే ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.బంగార్రాజు చిత్రం మంచి విజయం సాధించినప్పటికీ.. ఆ హిట్ చైతు ఖాతాలో పడింది. ఇక కొద్ది రోజులు క్రితం నాగార్జున `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక ప్రవీన్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది.

 కాగా దసరా పండుగ కానుక అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ప్రస్తుతం నాగార్జున తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు.ఇదిలావుంటే ఇక రీమేక్ చిత్రాలకు కాస్త దూరంగా ఉండే నాగార్జున ఈసారి మాత్రం కొత్త కథలను పక్కనపెట్టి ఓ మలయాళ సినిమాను తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా పలు మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక ఈ నేపథ్యంలోనే ఓ మలయాళ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే  చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మలయాళ సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ అవుతున్నారు.ఇక  ఇప్పుడు నాగార్జున కూడా అదే రూట్‌లో ఓ మలయాళ సినిమాను రీమేక్ చేసి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడట.ఈయన ఆశ నెరవేరుతుందా? అసలు నాగార్జున రీమేక్ సినిమా చేస్తానంటే అందుకు అభిమానులు ఒప్పుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: