తమిళ డైరెక్టర్  ప్రదీప్ రంగనాథన్  హీరోగా దర్శకుడిగా చేసిన తమిళ సినిమా 'లవ్ టుడే'. సేమ్  ఇదే టైటిల్ తో  ఈ మూవీని తెలుగులో దిల్ రాజు విడుదల చేశారు. తమిళంలో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో కూడా మెల్లిగా మొదలై భాక్సాఫీస్ దగ్గర పెద్దగా మారి  బ్రేక్  ఈవెన్  అయితే అయిపోయింది.కోలీవుడ్ లో ఈ సినిమాని నవంబర్ 4న రిలీజ్ చేశారు. తెలుగులో మాత్రం నవంబర్ 25 వ తేదీన రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు అనుకోని ట్విస్ట్ ఇక్కడ పడింది.అదేంటంటే లవ్ టుడే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆదివారం నాడు రివీల్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 2 వ తేదీ నుంచి లవ్ టుడే సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ కంపెనీ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వార్త తో తెలుగులో వసూళ్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.


అయితే ఇంత త్వరగా ఓటిటిలో విడుదల చెయ్యడానికి కూడా ఓ ప్రధాన కారణం వుంది.అదేంటంటే ఈ సినిమా పైరసీకి గురవ్వడం. అవును ఈ సినిమా సీన్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందుకే ఈ సినిమాని త్వరగా ఓటిటిలో విడుదల చేస్తున్నారు.అనుమానం ఉన్నచోట ప్రేమ పుట్టదనే పాయింట్‌తో ఫన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో ఉత్తమన్ ప్రదీప్ అనే రోల్ లో ప్రదీప్ రంగనాథన్ కనిపించగా నిఖితగా హీరోయిన్ ఇవానా నటించింది. ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసునే ఆలోచనలో ఉన్న ఓ యువ జంట పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు . కానీ ఒకరి ఫోన్‌ను మరొకరు ఒక రోజు మార్చుకోవాలని హీరోయిన్ తండ్రి పెట్టిన కండీషన్ వల్ల వారి పర్శనల్ సీక్రెట్స్ అనేవి అసలు ఎలా బయటపడ్డాయి? ఈ కండీషన్ వల్ల వారు విడిపోయే పరిస్థితి ఎలా వచ్చిందనేది చాలా మంచి కామెడీ ఇంకా అలాగే ఎమోషన్స్‌తో దర్శకుడు ఆవిష్కరించిన తీరు జనాలకు చాలా బాగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: