కన్నడ భామా నటి ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2019లో మాతృభాషలో హీరోయిన్ గా  నటించి పరిచయమైంది ఈమె .దాని అనంతరం టాలీవుడ్ కి రావడం జరిగింది.ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాని హీరోగా తిరగకెక్కిన గ్యాంగ్ లీడర్ మరియు శ్రీకారం సినిమాలతో ఫామ్ లోకి వచ్చింది .ఆమె నటించిన ఆ సినిమాలు పెద్దగా హిట్ అందుకోకపోయినా దాని అనంతరం కోలీవుడ్ నుండి మంచి ఆఫర్లు రావడం జరిగింది .ఇక అక్కడే ఆమె సత్తా ఏంటో చూపించి అనంతరం శివ కార్తికేయంతో జంటగా డాక్టర్ నటించింది.అనంతరం ఒక  సినిమాలో ఈమెకి రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది.

ఇక సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోగా ప్రియాంక మోహన్ కెరియర్ కి ఎలాంటి ఎఫెక్ట్ కూడా పడలేదు .దాని అనంతరం మరోసారి శివ కార్తికేయన్ తో జంటగా డాన్ సినిమాలో నటించి మంచి హిట్టును అందుకుంది. ఈ సక్సెస్ తో ఈమె మంచి ఊపు అందుకుంది .అయితే ఈమెకు సినీ వయసు మూడేళ్లు అయినప్పటికీ మూడు భాషల్లో ఇప్పటికీ అరడజను సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే ఇక తాజాగా నటి ప్రియాంక మోహన్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారుతుంది. ఇక అది ఏంటంటే అరడజను సినిమాలే చేసినప్పటికీ పారితోషకం మాత్రం భారీ మొత్తంలో తీసుకుంటుంది అనే సమాచారం వినబడుతుంది.

అయితే రెండు దశాబ్దాలుగా కొన్ని భాషల్లో హీరోయిన్గా నటిస్తూ అగ్ర కథానాయకగా పేరు తెచ్చుకున్న త్రిష లాంటి వారు కూడా మొన్నటి వరకు కోటి రూపాయల కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం జరిగింది. అయితే అలాంటిది నిన్నటి ప్రియాంక మోహన్ మాత్రం ఇప్పటి స్టార్ హీరోయిన్లకు సమానంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ను డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ కన్నడ భామ ధనుష్ కు జోడిగా కెప్టెన్ మిల్లర్ జయం రవి సరసన.. దర్శకుడు ఏం రాజేష్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించడం జరుగుతుంది. దీనికిగాను ప్రస్తుతం ఈమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: