రెజీనా అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు ఇంకా ఆమె తరువాత వచ్చిన అందరూ కూడా స్టార్ హీరోయిన్లు అయినా  ఆమె మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది పాపం. ఇప్పటికీ తన కెరీర్ ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు ఈ హాట్ బ్యూటీకి.రెజీనా తమిళ, తెలుగు ఇంకా కన్నడ భాషల్లో నటించిన హాట్ బ్యూటీ. ఈమె చెన్నైలొ పుట్టింది.. ఈమె తెలుగులో నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ ఇంకా అలాగే కొత్త జంట సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. ఇంకా అలాగే రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది. కాని ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. తరువాత రారా...కృష్ణయ్య, పవర్ వంటి చిత్రాలలో కూడా నటించడం జరిగింది. ఈమె తెలుగులోనే కాకుండ, తమిళ్, కన్నడ బాషలలో కూడా చిత్రాలు చేశారు.ఇక రెజీనా 1990 డిసెంబర్ 13న  చెన్నైలో పుట్టింది. ఆమె మాతృభాష తమిళం. ఈరోజుతో రెజీనా 32 ఏళ్ల వయసులోకి అడుగు పెడుతోంది. 2019 వ సంవత్సరంలో ఏక్ లడ్కీతో హైసా లగా అనే హిందీ సినిమాలో నటించింది. అలాగే ఈ సంవత్సరం రానాతో కలిసి '1945' సినిమాలో ఆమె నటించింది. ఈ మూవీ విడుదలైన సంగతి కూడా అసలు ఎవరికీ తెలియదు. రానా కూడా ఆ సినిమాతో తనకు సంబంధమే లేదు అన్నట్టు ముందుగానే చెప్పుకొచ్చాడు. క్లైమాక్స్ లేకుండా విడుదలైన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై చాలా దారుణంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.


రెజీనాకు అన్ని సినిమాల కంటే తెలుగులో వచ్చిన పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అడివి శేష్‌తో కలిసి ఎవరు అనే సినిమాలో పక్కా నెగెటివ్ షేడ్స్ పాత్రలో నటించి బాగా మెప్పించింది రెజీనా. ఇక ఒకవైపు సినిమాలు చూస్తూనే.. ఇంకోవైపు వెబ్ సిరీస్‌లతో కూడా అలరించింది. ఫింగర్ టిప్, ఆన్య ట్యూటోరియల్ ఇంకా అలాగే శూర్‌వీర్ వంటి వెబ్ సిరీస్‌లో నటించింది. ఇంకా కొన్ని చిత్రాలకు సైన్ చేసింది. ఇక రెజీనా రీసెంట్‌గా ప్రధాన పాత్రలో 'శాకినీ డాకినీ' మూవీతో పలకరించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకులేదు.దీంతో హీరోయిన్ గా ఈమె కెరీర్ ఇపుడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది. అయితే బోల్డ్ బ్యూటీగా రెజీనా జనం గుండెల్లో గూడు కట్టుకుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్ తో యూత్ కి గాలం వేస్తోంది రెజీనా. దీంతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరిగిపోతోంది. ఈమధ్య వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ చేసి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: