టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన అక్కినేని నాగార్జున ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగార్జున ఇప్పటికే ఈ సంవత్సరం బంగార్రాజు ,  బ్రహ్మాస్త్ర ,  ది ఘోస్ట్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

ఇందులో బంగార్రాజు మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ,  బ్రహ్మాస్త్ర మూవీ లో నాగార్జున కీలకcపాత్రలో నటించాడు. ది ఘోస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. ది ఘోస్ట్ మూవీ లో సోనాల్ చౌహాన్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీ కి లాంగ్ రాంగ్ లో భారీ కలెక్షన్ లు దక్కలేదు. దానితో ది ఘోస్ట్ మూవీ కి దాదాపు 17 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ లో నాగార్జున తన యాక్షన్స్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలంకరించగా ,  సోనాల్ చౌహన్ తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను సాధించక పోయినప్పటికీ ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి మాత్రం ఈ మూవీ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: