టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పుడు  బాబీ దర్శకత్వంలో రూపొందుతున్నాము మాస్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇక  ఇందులో అందాల భామ శృతిహాసన్ హీరోయిన్గా నటి స్తున్న... మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అంతేకాదు  కేథరిన్, సముద్రఖని, భావిసింహ, బిజు మీనన్ మరియు మరికొందరు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే దేవిశ్రీ సంగీతం అందిస్తున్న 

ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని ,వైరవిశంకర్ నిర్మిస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇందులో ఏసిపి విక్రమ్ సార్ పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ,టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి .ఇక రవితేజ ముఖ్య పాత్రలు నటిస్తున్న ఈ సినిమాలో ఆయన స్క్రీన్ టైమ్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ చేస్తున్నాడని

 మొదట అందరూ భావించడం జరిగింది. కానీ వాల్తేరు వీరయ్య సినిమా రన్ టైం మొత్తం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉంది .ఇక అందులో 45 నిమిషాల పాటు రవితేజ ఉంటాడు అని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ 45 నిమిషాలు రవితేజ పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని... సినిమాకు సైతం అతని పాత్ర హైలెట్గా నిలుస్తుంది అని తెలుస్తుంది.అయితే  ఇదే గనక నిజమైతే అటు రవితేజ ఫాన్స్ ఇటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: