టాలీవుడ్  ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి స్టార్ కమెడియన్ హోదాను పొందాడు. గతంలో అలీ కామెడీ లేకుండా ఒక్క సినిమా కూడా లేదు అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. కేవలం కమెడియన్ గానే కాకుండా అలీ యమలీల వంటి సినిమాలలో హీరోగా కూడా నటించడం జరిగింది. అలీ కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు బుల్లితెర మీద ప్రసారమయ్యే అలీతో సరదాగా అనే షోలో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. 

తాజాగా ఈ షో ముగిస్తున్న నేపథ్యంలో ఈ షోలో హోస్టుగా సుమ వచ్చి అలిని గెస్ట్ గా ఆహ్వానించి అలీ గురించి చాలా విషయాలను బయట పెట్టడం జరిగింది.అలీ తన కూతురు పెళ్లిని ఈ మధ్యకాలంలోనే జరిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పెళ్లి జరిగే టైంలో  ఆయన అల్లుడు చాలా కోటీశ్వరుడు అని ఫారన్  లో డాక్టర్ అంటూ ఇలా చాలా రకాలైన వార్తలు రావడం జరిగింది.అయితే ఆ వార్తలపై తాజాగా అలీ మాట్లాడుతూ నా అల్లుడికి ఆస్తులు ఏమీ అంతగా లేవు. కానీ వారిది మంచి పేరున్న కుటుంబం అందుకే నేను నా కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది.

 నా అల్లుడు ఫారెన్ లో డాక్టర్ అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నా అల్లుడు ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళందరూ డాక్టర్లు. కానీ నా అల్లుడు మాత్రం అమెరికాలో రోబోటిక్ ఇంజనీర్ అని ఆయన అల్లుడు గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు అలీ. ఆయన కూతురు పెళ్లికి చాలా కోట్లు ఖర్చు చేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో కూడా అలీ స్పందిస్తూ నాకున్న దాంట్లో నా శక్తికి తగ్గట్టు నా కూతురికి కట్నం ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు అలీ.. దీంతో అలీ ఆయన అల్లుడు గురించి చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: