మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అందానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. కేవలం పదిహేనేళ్ళ వయసులో నే ‘చాంద్ స రోషన్ చెహ్రా’ అనే సినిమాతో తమన్నా నాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత మంచు మనోజ్ హీరోగా చేసిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు చిత్రసీమకి పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ. ఆ తరువాత ‘కేడీ’ అనే ఓ తమిళ సినిమాలో నటించారు. ఇలా కెరీర్ మొదట్లోనే వరుసగా హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన తమన్నాకు ఆ పై ఆ సినిమా రంగాల్లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ గుర్తింపు రాలేదు.అయితే తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’తోనే తమన్నా లైఫ్ లో హ్యాపీ డేస్ మొదలయ్యాయని చెప్పాలి. అటు తమిళంలో ఇంకా ఇటు తెలుగులో మధ్య మధ్యలో  హిందీలోనూ నటిస్తూ తమన్నా  కెరీర్ పరంగా సక్సెస్ అయ్యింది.మిగతా భాషల్లో ఏమో కానీ తెలుగులో మాత్రం తమన్నా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.


ఈమె నటించిన “హండ్రెడ్ పర్సెంట్ లవ్, బద్రినాథ్, ఊసరవెల్లి, రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆగడు, బాహుబలి (సిరీస్)” సినిమాలు యూత్ ని ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మురిపించిన తమన్నా, మరికొన్ని సినిమాల్లో ఐటమ్ గాళ్ గా కూడా చేసి అల్లరించింది. ‘అల్లుడు శీను’లోని “లబ్బరు బొమ్మ…”, ‘స్పీడున్నోడు’లో “బ్యాచ్ లర్ బాబూ…”, ‘జాగ్వార్’లో “మందార తైలం…”, ‘జై లవకుశ’లో “స్వింగ్ జరా…”, ‘సరిలేరు నీకెవ్వరు’లో “డాంగ్ డాంగ్…” పాటల్లో తమన్నా మిల్కీ అందాలు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేశాయి. తమన్నా చేసిన ప్రతి ఐటమ్ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక సీనియర్ హీరో వెంకటేశ్ కి జోడీగా ‘ఎఫ్-2, ఎఫ్-3’ చిత్రాల్లో తమన్నా కామెడీ యాంగిల్ తో కూడా అదరగొట్టింది.చిరంజీవి ‘సైరా…నరసింహారెడ్డి’లో లక్ష్మి పాత్రలో కూడా ఎంతగానో మురిపించారామె.తెలుగు తమిళ నాట దాదాపు అందరి టాప్ స్టార్ల సరసన నటించిన రికార్డ్ తమన్నాకి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: