కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి ఈ సంవత్సరం వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ లలో కాంతారా మూవీ ఒకటి. ఈ మూవీ లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్నటువంటి నటులలో ఒకరు అయినటువంటి రిషబ్ శెట్టి హీరోగా నటించగా , సప్తమి గౌడ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. మొదట కన్నడ భాషలో విడుదల అయిన ఈ మూవీ కన్నడ భాషలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో , ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు.

తెలుగు లో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగు లో విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో కూడా విడుదల చేశారు. "ఓ టి టి" ఫ్లాట్ ఫ్యామిలీ  కూడా కాంతారా మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సంస్థ ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. కాంతారా మూవీ ని ఆస్కార్ అవార్డ్ ల కోసం దరఖాస్తు కు పంపినట్లు ఈ సంస్థ తాజాగా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించి , ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం పొందిన సినిమా కాంతారా అని సంస్థ అభిప్రాయ పడింది. ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఇప్పటివరకు రానందున తాము కూడా దరఖాస్తు చేస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. ఇది ఇలా ఉంటే కాంతారా మూవీ ద్వారా రిషబ్ శెట్టి కి పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: