తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన మూవీలలో హీరోగా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం నిఖిల్ "కార్తికేయ 2" మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్నాడు. కార్తికేయ 2 మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీలో హీరోగా నటించాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , గోపి సుందర్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ కి మూవీ యూనిట్ అద్భుతమైన సంఖ్యలో థియేటర్ లను బుక్ చేసింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
నైజాం : 135.
సీడెడ్ : 65.
ఆంధ్ర : 185.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 60.
ఓవర్ సీస్ లో : 400 ప్లస్.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 845 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: