పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హిట్స్ తో పని లేకుండా వరుస సినిమాల ఫుల్ బిజిగా వున్నారు.. ఏకంగా నాలుగైదు సినిమాలను చేతిలో పెట్టాడు.. ప్రస్తుతం ఆయన ఆదిపురుష్ సినిమాను పూర్తీ చేసిన ప్రభాస్, ఆ తరువాత సలార్, ప్రాజెక్ట్-కె చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. వాటితో పాటు మారుతి తో మరో సినిమాను లైను లో పెట్టాడు. ఇవే కాక..

 

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో 'స్పిరిట్' అనే సినిమా ను కూడా లైన్‌ లో పెట్టాడు ఈ బాహుబలి యాక్టర్. అయితే ఈ సినిమాలు ఇంకా పినిస్ కాకముందే, ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌ కు ఓకే చెప్పాడట ప్రభాస్. కాగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప-2' సినిమా ను తెరకెక్కించే పని లో బిజీగా ఉన్నాడు. ఈ మూవి ని ఈసారి కూడా పాన్ ఇండియా మూవీగా మరింత ప్రెస్టీజియస్‌ గా తీర్చిదిద్దుతున్నాడు సుకుమార్.


అయితే, ఇటీవల ఆయన ప్రభాస్‌ను కలిసినప్పుడు ఓ స్టోరీ లైన్‌ను డార్లింగ్ కు చెప్పాడు.. అది నచ్చిన ప్రభాస్ కూడా దాన్ని ఇంకా పూర్తిగా డెవలప్ చేయమని కోరాడట. దీంతో సుకుమార్ చెప్పిన స్టోరీలైన్‌కు ప్రభాస్ ఓకే చేశాడని.. త్వరలోనే ఈ కాంబో కూడా సెట్ ఇవ్వొచ్చున ని టాక్ . మరి ఈ వార్త లో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక వచ్చే వరకూ ఆగాల్సిందే.. ఏది ఏమైనా ప్రభాస్ మాంచి స్పీడ్.. వరుసగా ఆ రేంజ్ సినిమాలను తీసుకోవడం గ్రేట్ అనే అందరూ ప్రభాస్ పై ప్రశంసలు అందుకున్నారు. అన్నీ ఒకే కానీ ఒకే కానీ ఇక పెళ్లి గురించి ఎక్కడ అడిగిన మాత్రం డార్లింగ్ చెప్పలేదు.. ఏంటో మరి.. ఈయన అసలు చేసుకుంటాడా లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: