ప్రతి సంవత్సరం ఎంతోమంది దర్శకులు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు... కానీ వారిలో కొంతమంది దర్శకులు మాత్రమే దర్శకత్వం వహించిన మొట్టమొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గ తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తెలుగు భాషలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

దానితో ఈ మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా కియరా అద్వానీ హీరోయిన్ గా సందీప్ తలకెక్కించాడు. ఈ మూవీ హిందీ లో కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో సందీప్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సూపర్ క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తో యనిమల్ అనే మూవీ ని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను బయటకు వదిలింది. తాజాగా యానిమల్ మూవీ యూనిట్ ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రన్బీర్ కపూర్ అదిరిపోయే లుక్ లో ఉన్నాడు. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: