
టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు రావడంతో రష్మిక మందన్న రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది . అప్పటినుంచి రష్మికకు కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్యాడ్ నేమ్ రావడం మొదలయింది. ఇదిలా ఉండగా రష్మిక మందన్న నటించిన కిరిక్ పార్టీ సినిమా విడుదలై ఆరేళ్లు అయిన సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రిషబ్ శెట్టి కిరిక్ పార్టీ యూనిట్ ను టాక్ చేస్తూ థాంక్స్ చెప్పాడు. కానీ హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నని మాత్రం ఆయన ట్యాగ్ చేయలేదు.అలాగే హీరో రక్షిత్ శెట్టి కూడా రష్మికను ట్యాగ్ చేయలేదు అయితే రష్మిక కూడా అదే విధంగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో సిక్స్ ఇయర్స్ ఆఫ్ కిరిక్ పార్టీ.. వేర్ ఇట్ ఆన్ స్టార్టెడ్ అని పోస్ట్ చేసింది.
ఈ పోస్టులో దర్శకుడు కానీ, హీరో పేరు కానీ ట్యాగ్ చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే సైలెంట్ అవుతుంది అనుకుంటున్న ఈ వివాదం మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇకపోతే ఈ వార్తపై స్పందించిన పలు అభిమానులు రష్మిక మందన్న పరువు గోవిందా.. హీరో కానీ డైరెక్టర్ కానీ రష్మిక పేర్లు ట్యాగ్ చేయకపోవడం ఏంటి? ఇంతకంటే మరొక అవమానం ఉంటుందా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.