బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి,  చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హోరాహోరీగా పోరాటం సాగించడం ఖాయం అంటూ కూడా అంతా భావిస్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ..ఈ రెండు సినిమాలు కలిసి ఇప్పుడు దిల్ రాజు వద్ద థియేటర్ల కోసం పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు వల్లే చిరంజీవి,  బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఆశించిన స్థాయిలో లభించడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

ఇందుకు కారణం దిల్ రాజు ఆరు నెలల క్రితమే వారసుడు సినిమాకు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లను బుక్ చేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాలకు తన వారసుడు సినిమా కంటే తక్కువ థియేటర్ లు కేటాయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇదే సమయంలో అజిత్ నటిస్తున్న తునివు సినిమాను కూడా సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాడు. కాబట్టి దిల్ రాజు కావాలని మైత్రి మూవీ మేకర్స్ అలాగే చిరంజీవి,  బాలయ్య సినిమాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఇప్పుడు బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతే కాదు కావాలని చిరంజీవి , బాలయ్య సినిమాలకు సరైన థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.దీన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారం చాలా దూరం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నైజాం ఏరియాలో మెజారిటీ థియేటర్లు దిల్ రాజు ఆధీనంలో ఉన్నాయి.  కాబట్టి వాల్తేరు వీరయ్య,  వీర సింహారెడ్డి సినిమాలకు కచ్చితంగా డామేజి తప్పదు. విడుదల తర్వాత జరిగే డ్యామేజీని బట్టి దిల్ రాజు పై మెగా కాంపౌండ్ రియాక్షన్ ఉంటుందని అలాగే బాలయ్య తీరు కూడా ఉంటుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  మరి దిల్ రాజు చేస్తున్న ఈ పోరాటం  ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: