
ఖడ్గం సినిమాతో షఫీ తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాలో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇక 20 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 50 కి పైగానే సినిమాల్లో నటించాడు అని చెప్పాలి. అయితే ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే కావాలని పట్టుబట్టడంతో ఇక ఎక్కువ సినిమాలు చేయలేకపోయాడు అని చెప్పాలి. ఏకంగా ఖడ్గం సినిమాలో తీవ్రవాదిగా నటించేందుకు కాస్త రిస్క్ చేశాడు అని చెప్పాలి. పాత్రకు ప్రాణం పోయడం కోసం చార్మినార్ వీధుల్లో తన స్నేహితుడి ఇంట్లో ఒక నెల రోజులపాటు ఉండి అక్క వారి అలవాట్లు బాగా అర్థం చేసుకున్న తర్వాత ఖడ్గం సినిమాలో నటించాడట. నిజంగా ఒక నటుడు ఓ పాత్ర కోసం ఇలా చేయడం అంటే నిజంగా గొప్ప విషయమే కదా.