హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కోలీవుడ్ చిత్రం తునివు. ఈ సినిమాని తెలుగులో తెగింపు పేరిట విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నేచురల్ లుక్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు అజిత్. ఇందులో వైట్ హెయిర్ , గడ్డం తో భుజంపై గన్ను పట్టుకొని తన సత్తా ఏంటో చాటుతూ మరొకసారి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఊహించని దానికంటే ఆక్యుపెన్సీ పెరిగిపోతూ ఉండడం గమనార్హం.


తాజాగా సప్తగిరి 70MM rtc X రోడ్స్ లో తెగింపు ఆన్లైన్ బుకింగ్లు ప్రారంభించబడ్డాయి. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఊహించిన దానికంటే మెరుగ్గా టికెట్లు ఆన్లైన్ లో బుక్ అవుతూ ఉండడం చూస్తే నిజంగా సంక్రాంతి బరిలో ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్టే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారసుడు సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు అజిత్ కంటే విజయ్ గ్రేట్ అంటూ గొప్పలు పలికాడు. అంతేకాదు తెలుగు సినిమాలకు మించి వారసుడు సినిమా కోసం థియేటర్లను కేటాయించడంతో అభిమానులు కూడా ఒకవైపు నిరాశ మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కానీ ఇప్పుడు ఆయన పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యేటట్టు కనిపిస్తున్నాయి.

వారసుడు సినిమాకు ప్రేక్షకులలో అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ అయితే దక్కడం లేదు. మరొకవైపు చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు కూడా సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి. తునివు ఎలాగో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేటట్టు కనిపిస్తోంది. కాబట్టి మిగతా మూడు చిత్రాల పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది? ఏది ఏమైనా సంక్రాంతి బరిలో విడుదలకు ముందే సక్సెస్ చూస్తున్నాడు అజిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: