తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా ... బోనీ కపూర్మూవీ ని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ ని తమిళ్ లో తునివు పేరుతో విడుదల చేయనుండగా ... తెలుగులో తెగింపు పేరుతో విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాను తమిళ్ మరియు తెలుగు భాషలలో రెండింటిలో జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషలలో జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వారసు మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా వారసుడు మూవీ యూనిట్ ఈ సినిమా తెలుగు వర్షన్ ను జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనితో అజిత్ హీరోగా తెరకెక్కిన తెగింపు మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్ లు లభించే అవకాశం ఉంది. మరి తెగింపు మూవీ తో అజిత్ ఏ రేంజ్ ఓపెనింగ్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటాడో చూడాలి. తెగింపు మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల కూడా పరవాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: