ఇక మయోసైటిస్‌ సమస్యతో బాధపడుతూ ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పడింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. చాలా కాలం పాటు ఇంటికే పరిమితమైన  సమంత ఇక చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. తన కొత్త సినిమా శాకుంతలం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సామ్ సందడి చేసింది.ఓ పక్క అనారోగ్యం వల్ల శారీరకంగా మరో పక్క విడాకుల బాధ వల్ల మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా తన కోసం బలం కూడగట్టుకుని మరీ ఈ కార్యక్రమానికి హాజరైంది సమంత.అయితే చాలారోజుల తర్వాత ఆమెను చూసిన అభిమానులు ఆనందంతో బాగా పొంగిపోయారు. సోషల్ మీడియాలో కూడా ఆమెపై ప్రేమ కురిపించారు. ఇదే సమయంలో కొంత మంది నెటిజన్స్ మాత్రం ఆమె లుక్స్‌ గురించి నెగెటివ్‌ కామెంట్స్ చేశారు. 'సమంతను చూస్తే చాలా జాలిగా ఉంది. అనారోగ్యం వల్ల ఆమె అందం బాగా తగ్గిపోయింది. భర్తతో విడాకుల తర్వాత ఆమె కెరీర్‌లో ఉన్నతస్థానంలో ఉంటుందని భావిస్తుండగా.. మయోసైటిస్ జబ్బు ఆమెను మళ్లీ దెబ్బతీసింది. సమంతని మళ్లీ బలహీనురాలిని చేసింది' అంటూ అతి ప్రేమ కురిపించారు. 


ఈ ట్రోల్స్‌కు సమంత తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. 'నా లాగా కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదని నేను గట్టిగా కోరుకుంటున్నా. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కూడా మీకు కొంచెం పంపిస్తున్నా' అంటూ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది సమంత.అయితే ఈ విషయంలో పలువురు సినీ ప్రముఖులు కూడా సమంతకు మంచి సపోర్టుగా నిలుస్తున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్‌ హీరో అయిన వరుణ్‌ ధావన్‌ ఆమెకు సపోర్ట్ ఇచ్చి అండగా నిలిచారు. ఆ నెటిజన్‌ ట్వీట్‌కు స్పందిస్తూ 'నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం క్లిక్‌ బైట్స్‌ కోసమే ఇలా ఆలోచిస్తారు. నీకు అందం కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫిల్టర్స్‌ ఉన్నాయి. ఒక్కసారి సామ్‌ను కలువు. ఆమె గ్లో ఏంటో నీకే తెలుస్తుంది' అని స్ట్రాంగ్‌ కౌంటరిచ్చాడు వరుణ్ ధావన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సమంత ఇంకా వరుణ్‌ ధావన్ కలిసి బాలీవుడ్‌లో సిటాడెల్‌ అనే ఓ వెబ్‌ సిరీస్‌లో కలిసి నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: