స్టూడెంట్ నెంబర్ 2 మూవీ తో సినీ దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ... దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోను బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సంపాదించుకొని తన క్రేజ్ ను సినిమాకు పెంచుకుంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దర్శకుడు గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి పోయిన సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే.

డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య నిర్మించిన ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ ద్వారా రాజమౌళి కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళిసినిమా సీక్వెల్ కు సంబంధించి స్పందించాడు.

తాజాగా రాజమౌళి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సీక్వెల్ ఉంటుంది అని కన్ఫామ్ చేశాడు. ఈ మూవీ హిట్ అయినప్పుడు సీక్వెల్ పైన ఆలోచించాం  ఏది సెట్ కాలేదు. ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్న సమయంలో ఈ మధ్య ఓ మంచి ఐడియా వచ్చింది. దాని మీదే ఇప్పుడు కథ తయారు చేసే పనిలో ఉన్నాం అని రాజమౌళి తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అరుదైన అవార్డ్ లు కూడా దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: