మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. దాని అనంతరం ఆయన నటించిన రెండో సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అప్పట్లో ఆయన నటించిన మగధీర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రి పేరుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అలా స్టార్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్..

గతేడాది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలు హీరోగా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి గాను ఎన్నో అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. ఈ సినిమా అనంతరం ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతిలో ఆరు నుండి ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఈ విషయం కాస్త  సోషల్ మీడియా వేదికగా అవుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15 సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం రామ్ చరణ్ మరియు శ్రేయ కలిసి ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే రామ్ చరణ్ ఇండస్ట్రీకి రాకముందు యాక్టింగ్ స్కూల్ కి వెళ్లేవాడని తెలుస్తోంది. ఇక యాక్టింగ్ స్కూల్లో రామ్ చరణ్ ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో శ్రీయ కూడా ఉంది. ఆ వీడియోలో భాగంగా వీరిద్దరూ కలిసి ఒక థీమ్ కి సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో వాళ్ళిద్దరూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందుది. 2007లో చిరుత సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కేంద్రీ ఇచ్చాడు రామ్ చరణ్. కానీ శ్రేయ మాత్రం 2001లోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: