బాలీవుడ్ స్టార్ కపుల్ రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా నటించిన తాజా మరాఠీ చిత్రం 'వేద్'. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి ఎన్నో ప్రశంసలందుకుంటోంది.. బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతుంది. నటుడు రితేష్ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఇక వేద్ తెలుగు సినిమా అయిన మజిలీకి రీమేక్. నాగ చైతన్య, సమంత నటించిన ఈ సినిమా తెలుగులో మంచి సూపర్ హిట్ అయ్యుంది. ఇక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ అయిన తరణ్ ఆదర్శ్ ప్రకారం, వేద్ సినిమా విడుదలైన మొదటి వారంలో ఏకంగా రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసింది.ఇక ఈ సినిమాలో రితేష్ ఇంకా అతని భార్య జెనీలియా తమ యాక్టింగ్ తో మంచి ప్రసంసలు అందుకుంటున్నారు.ఇక టాలీవుడ్, బాలీవుడ్ కోలీవుడ్ లో చాలా సినిమాలు చేసి అలరించిన జెనీలియా పెళ్లి తరువాత సినిమాలు తగ్గించి పిల్లలతో గడుపుతూ గత పదేళ్ల నుంచి నటనకు దూరమైంది.


ఇప్పుడు వేద్‌లో ఆమె హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల నుంచి ఎంతగానో మెప్పు పొందుతుంది. ఇది ఆమెకు ఫస్ట్ మరాఠీ మూవీ కావడం విశేషం.కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన 15 రోజుల్లో ఏకంగా రూ.44.92 కోట్లు రాబట్టింది. గతంలో వచ్చిన మరాఠా బ్లాక్ బస్టర్ సైరాట్ (రూ.110 కోట్లు) తర్వాత ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వేద్ సినిమా నిలిచింది. ఇంకా ఇప్పటికీ మంచి వసూళ్ళని రాబడుతుంది. ఇక ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబడుతుందో చూడాలి.తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది జెనీలియా. ఆ తరువాత బాలీవుడ్ వెళ్లి అక్కడ అవకాశాలు కల్పించుకొని అక్కడ కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లని అందుకుంది.ఇక బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది జెనీలియా.

మరింత సమాచారం తెలుసుకోండి: