టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకొని సినిమాలో షూటింగ్లో మళ్లీ బిజీ అవ్వడానికి ఆమె ప్రయత్నిస్తోంది. అయితే మహేష్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సమంత సినిమాల విషయంలో ఏమాత్రం  కూడా వెనక్కి తగ్గడం లేదు. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూనే హాస్పిటల్ బెడ్ పైనుంచి యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పిన  సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల శాంకుతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ కూడా తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలన్న తపనతో సమంత ధైర్యంగా తన వ్యాధిని ఎదుర్కొని బిజీ అవ్వడానికి బాగా ప్రయత్నిస్తోంది. ఇకపోతే గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుందిని సమాచారం.. ఇది ఇలా ఉండగా తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్లో కూడా పాల్గొంటుందటా సమంత. అయితే అందుకు సంబంధించిన ఫొటోస్ ని మేకర్స్ అఫీషియల్ గా అయితే విడుదల చేశారు. అయితే బాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లల్లో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటని తెలుస్తుంది.. ఇందులో సమంత కీలకపాత్రలో నటించనుందని సమాచారం.. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడని సమాచారం.అయితే వరుణ్ ధావన్ సమంతా కలిసి నటించబోతున్న ఈ వెబ్ సిరీస్ సమంతకు కచ్చితంగా మంచి పేరు తెస్తుంది అని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఆ బాధను పక్కన పెట్టి తాను ఇచ్చిన కమిట్మెంట్స్ కి ఏ మాత్రం కూడా తగ్గని సమంత ఇలా మళ్లీ షూటింగ్లో పాల్గొనడం సమంత ఫ్యాన్స్ కు కొత్త ఊపుని అయితే ఇస్తోంది. దీంతో అభిమానులు సమంతకు వర్క్ పై ఉన్న డెడికేషన్ ని బాగా మెచ్చుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో కూడా ధైర్యం చేసి ఆ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంతకు ఆ వెబ్ సిరీస్ మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.08:10 PM
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: