నాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం దసరా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా మార్చి 30వ తేదీన సినిమాను రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాని కీర్తి సురేష్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా డి గ్లామరస్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ , ధూమ్ ధామ్ దోస్తాన్ వంటి పాటలు కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.

ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.  ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేస్తూ.. 30వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఒక వీడియో రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ టీజర్ కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండబోతోంది అంటూ కూడా చిత్ర బృందం వెల్లడించింది.  ఈ సినిమాలో నాని పూర్తి తెలంగాణ యాసలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్ సినిమాల సీక్వెన్స్ హవా త్వరలో కొనసాగబోతోంది అని చెప్పవచ్చు. గత ఏడాది విశ్వక్సేన్ తో హిట్, అడివి శేష్ తో హిట్  2 సినిమాలను తెరకెక్కించి మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని హిట్ 3 కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి నాని నటిస్తున్న దసరా సినిమా విడుదలవగానే హిట్ 3 సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈసారి హిట్ 3ని నిర్మించడమే కాదు అందులో కూడా నాని నటించబోతున్నారు. దీంతో అటు దసరా.. ఇటు హిట్ 3 సినిమాలపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: