రౌడీ స్టార్ అయిన విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడి ఇండస్ట్రీ కి వచ్చాడు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరో గా ఎదిగాడు.
పెళ్లి చూపులు సినిమాతో తనకంటూ అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు.

సినిమా తర్వాత వరుస ప్లాప్స్ వచ్చిన  కానీ ఈయనపై వున్న నమ్మకం ఏమాత్రం కూడా తగ్గడం లేదు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల అయిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా  షాక్ నుండి ఈ మధ్యనే విజయ్ బయట పడ్డాడని తెలుస్తుంది... ఆ తర్వాత  సినిమాలను చాలా జాగ్రత్త గా ఎంపిక చేసుకుంటూ ప్లాప్స్ పడకుండా చూసుకోవాలి అనుకుంటున్నాడు.

విజయ్ దేవరకొండ తన తరువాత సినిమా 'ఖుషీ'..  సమంత విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా మరోసారి బాగా వార్తల్లో నిలిచింది.. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది... అయితే కొన్నాళ్ల నుండి ఈ సినిమా షూట్ అయితే ఆగిపోయింది. లైగర్ ప్రమోషన్స్ కారణంగా ఆగిపోయిన ఈ షూట్ మళ్ళీ సమంత ఆరోగ్య సమస్యల కారణంగా ముందుకు వెళ్ళలేదు. దీంతో సమంత కారణంగా ఈ సినిమాపై చాలా రూమర్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి.. మరి ఈ రూమర్స్ కు డైరెక్టర్ ఖండిస్తూ ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఒక అప్డేట్ ఇస్తూ రెగ్యురల్ షూట్ ను త్వరలో నే  మొదలు పెడతాం అని తెలిపాడు.. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ఈ అప్డేట్ ఊరట ను కలిగించింది అనే చెప్పవచ్చు.. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మరి.. ఈ సినిమా తో అయిన విజయ్ మంచి విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: