ఆర్జీవీ శివ సినిమా భారీ విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తే రఘువరన్ మరియు జెడి చక్రవర్తులు విలన్ గా నటించారు.ఇక ఈ సినిమాలో సైకిల్ సీన్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.నాగార్జున సైకిల్ చైన్ లాగి దానితో ఫైట్ చేసే సీన్ అప్పట్లో ఒక ట్రెండ్ గా నిలిచింది.అయితే ఈ సైకిల్ చైన్ పెట్టడం వెనక చాలా పెద్ద కథ ఉందని తెలుస్తుంది.అలాగే ఈ సినిమా షూటింగ్ అయ్యాక ఆ సైకిల్ చైన్ ఎక్కడ ఉందో తెలుసా..

హీరో నాగార్జున కి విలన్ జేడి కి మధ్య ఒక ఫైట్ పెట్టల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మొదట ఒక ఫుట్ బాల్ గ్రౌండ్లో ప్లాన్ చేయాలని అనుకున్నాడట ఆర్జీవీ కానీ నాగార్జున బ్రదర్ వెంకట్ ఒప్పుకోక పోవడం తో సైకిల్ చైన్ కాన్సెప్ట్ చెప్పాడట అందుకు వెంకట్  కూడా ఒప్పుకున్నాడు.

కానీ ఐడియా అయితే చెప్పాడు కానీ అసలు లాగితే సైకిల్ చైన్ తెగుతుందా లేదా అని ఇంటికి వెళ్లి ప్రయత్నిస్తే అస్సలు చైన్ తెగకపోగా, చెయ్యి విరిగిపోతుంది అని అనుకున్నారట ఆర్జీవీ . అయినా కూడా సినిమా లో ఆ సీన్ చేశారట.. సినిమాలో సైకిల్ చైన్ కాన్సెప్ట్ ఇన్ని దశబ్దాల తర్వాత కూడా చాలా మంది మాట్లాడటం చూసి తను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడట.ఇక ఈ సైకిల్ చైన్ షూటింగ్ లో వాడిన తర్వాత ఎక్కడ ఉంది అని చాలా మందికి అనుమానం వుంది.. ఈ చైన్ ప్రస్తుతం తన కెరీర్ లో వర్మ ఒక పెద్ద హిట్ ఇచ్చాడని జేడి చక్రవర్తి తన ఇంట్లో ఇప్పటికి ఎంతో జాగ్రత్తగా అయితే దాచుకున్నాడు. ఇప్పటికీ కూడా అది ఆయన ఇంట్లోనే ఉంది. ఎన్నేళ్లు అయిన కూడా అది తనతోనే ఉంటుంది అని అందుకే శివ సినిమా అయిపోయాక ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి తెచ్చుకొని దాచుకున్న అని ఇటీవల ఒక ఇంటర్వ్యూ జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: