సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ మహేష్ బాబు కెరియర్ లో అతడు సినిమా మహేష్ బాబుకి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అయితే అప్పట్లో వచ్చిన అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ మాటలు మహేష్ నటన అందరినీ ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఈ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. వీటితోపాటు మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పాలి.అయితే ఈ సినిమా విడుదలైన మొదట్లో ఈ సినిమాను అందరూ తక్కువ అంచనా వేశారు. అనంతరం ఈ సినిమా ప్లీజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పగలేదు. 

ఇప్పటికీ సినిమా టీవీలో వస్తే టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు సినీ ప్రేక్షకులు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ముందుగా ఈ సినిమాకి మహేష్ బాబుని హీరోగా అనుకోలేదు. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాని మురళీమోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమా కథని ముందుగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి చెప్పాలి అని అనుకొని ముందుగా ఆయనకు వినిపించారట. ఇక పవన్ కళ్యాణ్ ని కలిసి కథ చెబుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కథ వింటూ నిద్రపోయాడట. ఇక ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో త్రివిక్రమ్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ మిస్ అయిన ఈ సినిమాని తర్వాత మరో హీరో కోసం అనుకున్నాడట త్రివిక్రమ్. ఆ హీరో మరెవరో కాదు ఉదయ్ కిరణ్.

అప్పట్లో ఉదయ్ కిరణ్ కి ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవర్ బాయ్ గా ఈయనకి మంచి క్రేజ్ ఉండేది.మురళీమోహన్ గారు ఈ స్టోరీ విన్నానంతరం మొదటగా ఈ సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ ని తీసుకున్నామని భావించారట. ఇక సమయంలో ఉదయ్ కిరణ్ మెగా ఫ్యామిలీతో సంబంధం కలుపుకొని బిజీగా ఉన్నారట. అంతేకాదు ఆ సమయంలో అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ను చూసుకునే వారిని తెలుస్తోంది. అనంతరం మురళీమోహన్ అరవింద్ ను కలిసి విషయాన్ని చెప్పగా ఉదయ్ కిరణ్ డేట్స్ ఖాళీ లేవని ఆయన చెప్పాడట. దాంతో ఈ కథను ఇద్దరి హీరోల తర్వాత మహేష్ బాబుకి చెప్పారట. దీంతో ఈ సినిమా మహేష్ బాబు చేయడం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: