ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో కెరియర్ ప్రారంభంలో ఎన్ని మూవీ లలో నటించినప్పటికీ రాని గుర్తింపు పోయిన సంవత్సరం నటించిన డీజే టిల్లు మూవీ తో దక్కించుకున్నాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన డీజే టిల్లు మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ యువ హీరో బాడీ లాంగ్వేజ్ ... డ్రెస్సింగ్ స్టైల్ ... డైలాగ్ డెలివరీ అన్నీ కూడా యువతను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ తో సిద్దు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ మూవీ కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే పేరుతో రూపొందుతున్న మూవీ లో సిద్దు ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్దు మరో అదిరిపోయే రేంజ్ ఉన్న బ్యానర్ లలో తేరకేక్కబోయే సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన బ్యానర్ లు అయినటువంటి బిబిఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లలో రూపొందబోయే మూవీ లో సిద్దు కు అవకాశం లభించినట్లు ... ఈ మూవీ కి కొత్త దర్శకురాలు అయినటువంటి వైష్ణవి దర్శకత్వం వహించబోతున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: