సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోర్చు చూస్తే హీరోయిన్లకు కెరియర్ కారం చాలా తక్కువగా ఉంటుందని సినీ పండితులు చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పడమే కాదు ఇక ఎంతో మంది హీరోయిన్ల విషయంలో కూడా ఇది నిజం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎవరో అనుష్క, నయన తార లాంటి హీరోయిన్లు మినహా ఇక మిగతా అందరూ హీరోయిన్లు కూడా ఇండస్ట్రీ లోకి వచ్చి ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కొన్ని సినిమాలకే తట్ట బుట్ట సర్దుకుని వెళ్లిపోయిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఎంత బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం సరైన అవకాశాలు అందుకోలేక ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామందే.


 అయితే సినిమాల్లో హీరోయిన్లుగా వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఇక అందరూ హీరోయిన్లు కూడా ఫిజిక్ మెయింటైన్ చేయడంపై దృష్టి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే దివి నుంచి భువికి దిగివచ్చిన అప్సరసలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే సినిమాలకు దూరంగా ఉంటారో ఇక అప్పుడు ఫిజిక్ గురించి జాగ్రత్త తీసుకోకుండా లావుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సలోని కూడా ఒకరు. అప్పటివరకు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించిన సలోనికి ఇక గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి నుంచి పిలుపు వచ్చింది. సునీల్ హీరోగా తెరకెక్కిన మర్యాద రామన్న సినిమాలో నటిస్తావా అంటూ స్వయంగా జక్కన్న అడగడంతో సలోని ఎగిరి గంతేసింది. ఇక అనుకున్నట్లుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  అయితే ఈ సినిమాలో సలోని తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇటీవల హైదరాబాద్ లోని ఒక జువెలరీ ర్యాంప్ షోలో కనిపించింది. ఆమెను చూసిన అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోయారు. జక్కన్న హీరోయిన్ సలోని ఏంటి ఇంత బొద్దుగా మారిపోయింది అంటూ అందరూ షాక్ అవుతున్నారు. సలోని ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: