సినిమా సెలెబ్రెటీలు రాజకీయనాయకులు రోజుకోరకంగా మాట్లాడటం సర్వసాధారణం. అలా మాట్లాడినందుకు ఎవరైనా విమర్శలు చేస్తే అప్పటి పరిస్థితులు కారణంగా అలా మాట్లాడవలసి వచ్చింది అంటూ తెలివిగా తప్పించుకుంటారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ భారీ మూవీ ప్రాజెక్ట్ ‘సలార్’ విషయంలో కూడా ఇదే జరుగుతోందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈమధ్య కాలంలో ఒక సినిమా కథను రెండు పార్ట్ లుగా తీసి విడుదల చేస్తే ఆమూవీ పై క్రేజ్ తో పాటు ఆమూవీ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరుగుతున్న పరిస్థితులలో ‘సలార్’ మూవీని కూడ రెండు భాగాలుగా తీస్తారని లీకులు వచ్చాయి. దీనికితోడు ప్రశాంత్ నీల్ ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సలార్’ కథ చాల పెద్దది కావడంతో ఈమూవీని రెండు భాగాలుగా తీయవలసిన అవసరం ఉంది అంటూ చెప్పడంతో ఈమూవీ రెండు భాగాలుగా వస్తుందని అందరూ అంచనాలు వేసుకున్నారు.


‘సలార్’ షూటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుండి రకరకాల సమస్యలు ఈమూవీని వెంటాడటంతో పాటు క్రితం సంవత్సరం కృష్ణంరాజు మరణించడంతో ‘సలార్’ షూటింగ్ చాల ఆలస్యంగా నడిచింది. దీనితో ఈసినిమాకు సంబంధించి యాక్షన్ ప్లాన్ మారింది అంటూ ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ లో విడుదల కావలసి ఉన్న ఈమూవీ విడుదలను కొన్నిరోజులు వాయిదా వేసి కథలో కూడ చిన్న మార్పులు చేసి ‘సలార్’ మూవీని ఒకే పార్ట్ గా విడుదలచేయాలి అన్ననిర్ణయానికి ప్రభాస్ ప్రశాంత్ నీల్ లు వచ్చినట్లు టాక్.


ఇలా ప్రశాంత్ నీల్ ప్రభాస్ లు నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది అంటున్నారు. ఎప్పటి నుంచో వార్తలలో ఉన్న జూనియర్ ప్రశాంత్ నీల్మూవీ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం చివరిలో ప్రారంభించాలని తారక్ స్థిరనిర్ణయం తీసుకున్నట్లు టాక్. దీనికి అనుగుణంగా తాను కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలు ఎట్టి పరిస్థితులలోను అక్టోబర్ కు పూర్తి చేసి వెంటనే ప్రశాంత్ నీల్ వైపు వెళ్లాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు అని అంటున్నారు. ఈవిషయాన్ని తెలుసుకున్న ప్రశాంత్ నీల్ జూనియర్ ప్రాజెక్ట్ ను మరింత ఆలస్యం చేయకుండా ‘సలార్’ ను ఒక భాగంతో సరిపెట్టి రెండు భాగాల ఆలోచనలను విరమించుకున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: