తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎంతో  స్టార్ట్ డం సంపాదించుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే కమెడియన్ గా సక్సెస్ అయినంత గా హీరోగా కాలేకపోయాడు. దాంతో అగ్ర హీరోల సినిమాల్లో విలక్షణ పాత్రలు చేస్తూ ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు ఈ మధ్య విలన్ గా కూడా సునీల్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటే సునీల్ కు విలన్ గానే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఇతనికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటు తెలుగులోనూ అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు. 

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇక తాజా ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ..' తనకు తెలిసి 6 ప్యాక్ చేయడం కంటే ఆడియన్స్ ను నవ్వించడమే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కామెడీ అనేది ఆడియన్స్ కి అందుబాటులో ఉందని చెప్పాడు. అంతేకాకుండా ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను అల్లు అర్జున్ పుష్ప2 లోను, అలాగే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో సినిమాలో, అటు సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలో నటిస్తున్నట్లు తెలిపాడు.

ఇక తమిళంలో అయితే రజనీకాంత్ జైలర్, కార్తీతో జపాన్, శివ కార్తికేయన్ తో  ఓ సినిమాలో, అటు విశాల్ సినిమాలోనూ నటిస్తున్నట్లు వెల్లడించాడు. వీటితోపాటు ఇంకో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పాడు. అటు బాలీవుడ్ నుంచి కూడా తనకు అవకాశాలు వస్తున్నట్లు తెలిపాడు. ఈ మధ్యకాలంలో సునీల్ ఇన్ని సినిమా అవకాశాలతో బిజీగా ఉండడం చూడలేదు. కానీ ఇప్పుడు విలన్ గా అద్భుతమైన నటన కనపరచడంతో అతనికి విలక్షణ పాత్రల్లో వరుస అవకాశాలు ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా కోలీవుడ్లో అయితే సునీల్ అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ ఉండడం గమనార్హం. అందులో మొదటగా రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి సునీల్ ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ని అందుకుంది. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: