నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందినటు వంటి అమిగోస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం ... అలాగే ఈ సినిమాలో కెరియర్ లో మొట్ట మొదటి సారి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా పరవాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు లభించాయి. మరి మొదటి రోజు ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు లభించాయో తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 71 లక్షల కలెక్షన్ లు లభించగా ... సీడెడ్ లో 29 లక్షలు ... యూ ఏ లో 23 లక్షలు ... ఈస్ట్ లో 18 లక్షలు ... వెస్ట్ లో 10 లక్షలు ... గుంటూరు లో 31 లక్షలు ... కృష్ణ లో 13 లక్షలు ... నెల్లూరు లో 8 లక్షలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు ఈ మూవీ కి 2.03 కోట్ల షేర్ ... 3.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 20 లక్షలు ... ఓవర్సీస్ లో 35 లక్షల కలెక్షన్ లు మొదటి రోజు లభించాయి.
మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.58 కోట్ల షేర్ ... 4.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: