టాలీవుడ్ స్టార్ హీరో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ నెల చివరిలో అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర బృందం. ఇకపోతే మార్చి నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించబోతుందని క్లారిటీ కూడా వచ్చేసింది. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. 

కానీ ఇటీవల శంషాబాద్ సమీపంలోని ఒక హోటల్లో కొరటాల శివ ఆధ్వర్యంలో జాన్వీకపూర్ యొక్క ఒక ఫోటో షూట్ ని చిత్ర బృందం నిర్వహించడం జరిగింది. అయితే ఆ ఫోటోషూట్ లో జాన్వి కపూర్ మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది .ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్ కాంబినేషన్ బావుంది అని టాక్ రావడంతో కొరటాల శివ కూడా జాహ్నవికాపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొందరు పట్టుబడి కొరటాల శివకు ఇష్టం లేకుండా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడు అంటూ ప్రచారం చేస్తున్నారు.

 అయితే ఇదేమీ కొత్త కాదు గతంలో జూనియర్ ఎన్టీఆర్ చాలామంది హీరోయిన్ల విషయంలో ఇలాగే పట్టుబట్టి తన సినిమాలో హీరోయిన్లుగా ఫిక్స్ చేయించాడట. ఇప్పుడు జాహ్నవి కపూర్ విషయంలో కూడా అదే జరిగింది అంటూ కామెంట్లను చేస్తున్నారు. అంతేకాదు జాన్వి కపూర్ తన సినిమాతోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పట్టుబడి మరి జాన్వీ కపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేయించాడట ఎన్టీఆర్. కానీ చాలామంది ఈ వార్తని ఖండిస్తున్నారు. కొరటాల శివ గతంలో జాహ్నవి కపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేయాలని స్వయంగా తానే నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: